అంబాలా జైలు మట్టితో గాడ్సే విగ్రహాన్ని రూపొందిస్తా౦: హిందూ మహాసభ

Date:

Share post:

Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.

సోమవారం ( 15 నవ౦బర్) గాడ్సే వర్ధంతిని పురస్కరించుకుని హి౦దూ మహాసభ‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

“గత వారం మహాసభ కార్యకర్తలు గాడ్సే మరియు నారాయణ్ ఆప్టేలను ఉరితీసిన అంబాలా జైలు నుండి మట్టిని తీసుకువచ్చారు. ఈ మట్టితో గాడ్సే, ఆప్టే విగ్రహాల తయారీకి వినియోగిస్తాం, వాటిని గ్వాలియర్‌లోని మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జైవీర్ భరద్వాజ్ విలేకరులకు తెలిపారు.

మీరట్ (ఉత్తరప్రదేశ్)లోని ‘బలిధాన్ ధామ్’లో మహాసభ కార్యకర్తలు గాడ్సే, ఆప్టే విగ్రహాలను సోమవారం ప్రతిష్ఠించారని ఆయన చెప్పారు.

“మేము ప్రతి రాష్ట్రంలో అటువంటి బలిదాన్ ధామ్ నిర్మిస్తాము,” అన్నారాయన.

గ్వాలియర్ జిల్లా యంత్రాంగం 2017లో గాడ్సే ప్రతిమను (ఇక్కడ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేయబడింది) సీజ్ చేసిందని, అయితే ఇప్పటి వరకు దానిని తిరిగి ఇవ్వలేదని ఆయన అన్నారు.

దేశ విభజనకు (1947లో) కాంగ్రెస్సే కారణమని, దీని ఫలితంగా పెద్ద ఎత్తున హత్యలు జరిగాయని భరద్వాజ్ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, సోమవారం ఇక్కడ హిందూ మహాసభ బహిరంగ కార్యక్రమం లేదని గ్వాలియర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సత్యేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

ఇప్పటి వరకు ఎలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని, ఆ సంస్థ కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తొలగించాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగు...

YSRCP: వైసీపీ తొమ్మిదవ జాబితా విడుదల

రాష్టంలో రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ప్రభుత్వం శుక్రవారం వైసీపీ 9వ జాబితాను విడుదల చేసింది...

మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వెయ్యదు: వైఎస్. సునీతా రెడ్డి

మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సంచల వ్యాఖ్యలు (YS Sunitha Reddy Comments on Jagan YSRCP...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

Eagle OTT: ఓటీటీ లోకి వచ్చేసిన ఈగల్

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా, అనుపమ మరియు కావ్య థప్పర్ హీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఈగల్ ఓటీటీ...

యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ ఖాయం: సీఎం యోగి

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు (Yogi Adityanath  Comments on UP Lok...

జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం…12 మంది మృతి

బుధ‌వారం రాత్రి జార్ఖండ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది (Jharkhand Train Accident). అసనోల్ డివిజన్ జంతారా ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటుతున్న...

బీఆర్ఎస్ పార్టీకి షాక్… నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu...

కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క...

Basara IIIT: గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపుతోంది. కాలేజీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు...

ప్రతి పేద కుటుంబానికి నెలకి రూ: 5000 ఇస్తాం: ఖర్గే

Indiramma Universal Basic Income Support Scheme: ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5000 (Rs...