Miss Universe 2021 Harnaaz Sandhu: భారతీయ అందాల భామలు చరిత్రలో చాలా సార్లు ‘మిస్ వరల్డ్‘ బిరుదును పొందారు. కానీ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని ఇంటికి తీసుకురాగలిగాం.
అయితే 21 ఏళ్ల తర్వాత… చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు ఇజ్రాయెల్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021లో ‘మిస్ యూనివర్స్ 2021’ టైటిల్‌ను గెలుచుకుని యావత్ భారతదేశాన్ని గర్వపడేలా చేసింది.
గత౦లో ఈ టైటిల్ ను గెలుచుకున్న నటి మరియు మోడల్ సుస్మితా సేన్ (1994) మరియు లారా దత్తా తర్వాత టైటిల్‌ను సొంతం చేసుకున్న మూడవ భారతీయురాలుగా హర్నాజ్ నిలిచారు.
లారా దత్తా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. యాదృచ్ఛికంగా, దత్తా కిరీటాన్ని గెలుచుకున్న సంవత్సరంలోనే హర్నాజ్ సంధు జన్మి౦చడ౦ విశేష౦.
“నాకు మార్గనిర్దేశం చేసినందుకు మరియు మద్దతు ఇచ్చినందుకు ఆ భగవ౦తుడికి, నా తల్లిదండ్రులకు మరియు మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు నేను చాలా కృతజ్ఞురాలుని. నాకోస౦ ప్రార్థించి మరియు నాకు కిరీట౦ దక్కాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ నా ప్రేమాభివ౦దనాలు” అ౦టూ హర్నాజ్ సంధు ఉప్పొంగిపోయినట్లు NDTV తెలిపి౦ది.
“నా బలం, నా జీవితరేఖలు” అని తన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ, ఆమె తన IG కథనాలలో కొన్ని ఫోటోలను పంచుకున్నారు.
ఆమె చివరి రౌండ్‌లో ‘ఈరోజుల్లో ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో యువతులకు ఏమి సలహా ఇస్తారు’ అని అడిగినప్పుడు ఆమె ఇలా స్పందించింది.
“నేటి యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఒత్తిడి ఏమిటంటే, తమను తాము విశ్వసించడం, మీరు ప్రత్యేకమైనవారని తెలుసుకోవడం మరియు అదే మిమ్మల్ని అందంగా మార్చడం. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరింత ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం.”
ఈ శుభవార్త వెలువడిన వె౦టనే, ఆన౦ద్ మహి౦ద్రా, ప్రియాంక చోప్రా మరియు లారా దత్తాతో సహా పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలిపారు.
No better way to start the week than by hearing this… #MissUniverse #MissUniverse2021 #HarnaazSandhu #india
pic.twitter.com/moyhkhTudW— anand mahindra (@anandmahindra) December 13, 2021
Congratulations @HarnaazSandhu03 !!!! Welcome to the club!!! We’ve waited 21 long years for this!!! You make us SO SO proud!!! A billion dreams come true!!! @MissDivaOrg @MissUniverse
— Lara Dutta Bhupathi (@LaraDutta) December 13, 2021
హర్నాజ్ సంధు 2017లో కేవలం 17 సంవత్సరాల వయస్సులో ‘టైమ్స్ ఫ్రెష్ ఫేస్’ అవార్డును గెలుచుకోవడం ద్వారా తన పోటీ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది.
వెంటనే, ఆమె ‘LIVA మిస్ దివా యూనివర్స్ 2021’ టైటిల్‌తో కిరీటాన్ని పొందింది, అక్కడి నుండి ‘మిస్ యూనివర్స్’ గా ఆమె ప్రయాణం ప్రారంభమైంది.
ఈ అందాల భామ ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తోంది మరియు వచ్చే ఏడాది విడుదల కానున్న రెండు పంజాబీ సినిమాలు కూడా ఉన్నాయని సమాచార౦.