Hardik Pandya ruled out of World Cup 2023: ఇండియా క్రికెట్ అభిమానులకు చేదు వార్త. చీలి మండ గాయంతో కొన్ని మ్యాచ్ల నుంచే జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్య ఇప్పుడు వరల్డ్ కప్ మెగా టోర్నీ నించి వైదొలిగాడు.
ఈ విషయాన్ని అల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియపరిచారు. విష్యం తెలుసుకున్న క్రికెట్ అభిమానులు హార్దిక్ పాండ్య త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా జట్టులోకి త్వరగా తిరిగి రావాలని కోరుకున్నారు.
వరల్డ్ కప్ లో ఇప్పటికే ఇండియా సెమిస్ కు క్వాలిఫై అయినప్పటికీ… రానున్న అసలైన మ్యాచులో హార్దిక్ లేకపోవడం టీం ఇండియా ని కలవర పరిచే విషయమే అని చెప్పాలి.
చీలి మండ గాయం:
టీం ఇండియా బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ల్లో బౌలింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్య బంతిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. చీలి మండ గాయం అవ్వడంతో అతడిని నేషనల్ క్రికెట్ అకాడమీ తీసుకెళ్లారు. మొదట న్యూజీలాండ్ మ్యాచ్ కు తిరిగి అందుబాటులోకి వస్తాడు అని అందరు భావించారు. కానీ గాయం ప్రభావం ఎక్కువ ఉండడంతో స్టార్ అల్ రౌండర్ వరల్డ్ కప్ కు దూరం కావాల్సి వచ్చింది.
పాండ్య స్థానం లో ప్రసిద్ధ్ కృష్:
అయితే స్టార్ అల్ రౌండర్ హార్దిక్ స్థానం లో యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ను టీం ఇండియా మ్యానేజ్మెంట్ భర్తీ చేసినట్లు సమాచారం. మరి ఈ యువ ఫాస్ట్ బౌలర్ ఎంతగా ఆకట్టుకుంటాడో వేచిచూడాల్సి విషయమే.
ప్రసిద్ధ్ కృష్ణ సెలక్షన్ నిర్ణయం పై నెటిజన్లు కొందరు ఏకీభవించగా… మరికొందరు అల్ రౌండర్ హార్దిక్ పాండ్య స్థానంలో దీపక్ చాహర్ లేదా వెంకటేష్ ఇయర్ ను కానీ ఎంపిక చేసుండాల్సింది అని భిన్న అభిప్రాయాలూ వ్యక్తం చేశారు.
వరల్డ్ కప్ నుంచి హార్దిక్ అవుట్ (Hardik Pandya Ruled Out of World Cup):
Tough to digest the fact that I will miss out on the remaining part of the World Cup. I'll be with the team, in spirit, cheering them on every ball of every game. Thanks for all the wishes, the love, and the support has been incredible. This team is special and I'm sure we'll… pic.twitter.com/b05BKW0FgL
— hardik pandya (@hardikpandya7) November 4, 2023
ALSO READ: WCW 2023 IND VS SL: భారత్ చేతిలో లంక చిత్తు