దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

Date:

Share post:

Emergency Alert on Phones: దేశవ్యాప్తంగా గురువారం కొంతమంది మొబైల్ వినియోగదారులకు ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. అయితే ఈ అలర్ట్‌ మెసేజ్ చూసి చాలామంది ప్రజలు దీనిని ఎవరు పంపారో? ఎందుకు పంపారో తెలియక ఆందోళనకు గురైనట్లు సమాచారం.

ఇక విషయానికొస్తే… ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ టెస్టింగ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే ఈ మెసేజ్‌ వచ్చినట్లు తెలిసింది. రాబోయే ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టి ప్రజలను ఒకేసారి అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం వినూత్న పద్ధతిలో మొబైల్‌ ఫోన్లలో కొత్త ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను పరీక్షిస్తోంది. ఈ టెస్టింగ్ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి చాల మందికి ఈ మెసేజ్ ను పంపడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అనుబంధంతోనే ఈ టెస్టింగ్ జరిగింది. విషయం తెలుస్తుకున్న నెటిజన్లు ఈ వార్తని సోషల్ మీడియా మొత్తం వైరల్ చేశారు.

భూకంపాలు సంభవించినప్పుడు అలాగే ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, సునామీలు, ఇతర విపత్తులేమైనా వచ్చినప్పుడు ప్రజలను తక్షణమే అలర్ట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌ను పట్టించుకోవద్దని… మీ నుంచి ఎలాంటి స్పందన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ మెసేజ్ మొదట ఇంగ్లిష్ భాషలో అలర్ట్ రాగా, తరువాత తెలుగు, హిందీ భాషల్లో కూడా సందేశాన్ని పంపించారు. అయితే ఎలాంటి అలర్ట్‌ మెసేజ్‌లు జులై 20, ఆగస్టు 17 తేదీల్లో కూడా కొన్ని వచ్చాయని కొంతమంది పేర్కొంటున్నారు.

emergency-alert-on-mobiles

విపత్తుల గురించి ప్రజలను హెచ్చరించేందుకు యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా మొదలగు దేశాలలో ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను అమలులో ఉన్నాయి. అయితే ఇప్పుడు భారత్‌ కూడా అలాంటి వ్యవస్థనే అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.

ఇంతకీ ఈ ఎమర్జెన్సీ అలెర్ట్ లో ఏముంది?

‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన శాంపిల్ టెస్ట్ మెసేజ్. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. మీ నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ TEST Pan-India ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ నుంచి పంపించబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది’ అని మెసేజ్ లో ఉంది.

ఎమర్జెన్సీ అలెర్ట్ (Emergency Alert on Phones):

ALSO READ: ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles