Election Commission seized 1760 crore: ఐదు రాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ప్రలోభపరచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సుమారు రూ.1760 కోట్ల విలువైన డబ్బు, డ్రగ్స్, మద్యం, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది.
మీడియా సమాచారం ప్రకారం… ఈ ఐదు రాష్ట్రాలలో తెలంగాణలోనే అత్యధికంగా ఆస్తులు జప్తు అయ్యాయి అని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.659 కోట్ల విలువైన నగదు, మద్యం, ఖరీదైన లోహాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సమాచారం. ఇందులో రూ.225.25 కోట్ల నగదు రూపంలో పట్టుబడింది.
అంతేకాకుండా రూ. 86.82 కోట్ల విలువచేసే మద్యం, రూ. 103.74 కోట్ల విలువచేసే డ్రగ్స్, రూ. 191.02 కోట్ల విలువచేసే వస్తువులు, రూ. 52.41 కోట్ల విలువచేసే ఉచితాలు ఉన్నాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అయితే ఐదు రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ రెండొవ స్థానంలో ఉన్నట్లు తెల్సుతోంది. రాజస్థాన్ లో ఇప్పటికి రూ.650.7 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.