రెండో దశలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు సుమారు 513 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది.
ఇందులో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలోనే 103 మంది వైద్యులు ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత బిహార్‌లో 96 మంది, ఉత్తరప్రదేశ్‌లో 41 మంది, రాజస్థాన్‌లో 39 మంది, ఆంధప్రదేశ్‌లో 29 మంది, జార్ఖండ్‌లో 29 మంది, తెలంగాణలో 29 మంది వైద్యులు మృతి చెందారు. ఒడిశాలో 16 మంది, తమిళనాడులో 18మంది, పశ్చిమబెంగాల్‌లో 19 మంది కరోనాకు బలయ్యారు.
కరోనా ఫస్ట్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు మృతి చెందారని చెప్పింది. ఫస్ట్, సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా మృతి చెందారని పేర్కొన్నారు. ఐఎంఐ రిజిస్ట్రీ మేరకు 3.5లక్షల మంది సభ్యులు ఉన్నారని, దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షలకుపైగా వైద్యులుంటారని తెలిపింది. ఇందులో సుమారు 66 శాతం మందికే టీకాలు వేసుకున్నట్లు పేర్కొంది.