దాసోజు శ్రవణ్ కు షాక్ … నామినేషన్ తిరస్కానించిన గవర్నర్

Date:

Share post:

Dasoju Sravan MLC Rejected: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ తమిళిసై దాసోజు శ్రావణ్ నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఈ రోజు తెలిసింది.

గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరి పేర్లను (దాసోజు శ్రవణ్ కుమార్, కె. సత్యనారాయణ) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కే.సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖను రాశారు గవర్నర్ తమిళిసై. ఈ లేఖలో ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి అనర్హులని తమిళిసై తెలియజేశారు.

అంతేకాకుండా నామినీల ప్రొఫైల్‌లో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి తప్పనిసరి అయిన సాహిత్యం, సైన్స్, ఆర్ట్, సహకార ఉద్యమం మరియు సామాజిక సేవల్లో వారి ప్రత్యేక పరిజ్ఞానాన్ని సూచించడం లేదని ఆమె అన్నారు.

ఇదేం కొత్త కాదు:

అయితే… బీఆర్‌ఎస్ ప్రభుత్వం శాసనమండలికి గవర్నర్ కోటా సిఫార్సులను గవర్నర్ సౌందరరాజన్ తిరస్కరించడం ఇదే మొదటిసారి కాదని తెలుస్తోంది.

గతంలో కూడా బీఆర్‌ఎస్ నాయకుడు పి.కౌశిక్ రెడ్డి పేరును తమిళిసై తిరస్కరించడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ కోటా కింద ఉన్న అవసరాలను అతను తీర్చలేడని ఆమె తెలిపినట్లు సమాచారం.

దాసోజు శ్రావణ్ నామినేషన్‌ తిరస్కరణ : (Tamilisai rejected Dasoju Sravan MLC nomination):

ALSO READ: తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంగం పర్యటన… తేదీలు ఖరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles