తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు (KCR Comments on Revanth Reddy). తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మంగళవారం తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే… నన్ను నా పార్టీని తిడుతున్నారు అని కేసీఆర్ అన్నారు. నన్ను నా పార్టీని టచ్ చేయడం ఏ సీఎం వల్ల కాదు అని అన్నట్లు తెలుస్తోంది.
మరియు తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు కాపాడుకున్నాం అని… ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉడుత బెదిరింపులకు నేను భయపడను అని… రేవంత్ రెడ్డి కంటే ఎందరో హేమాహేమీలను ఎదుర్కున్న చరిత్ర మాకుంది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ALSO READ: బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్