Bihar North East Express Train Accident: బీహార్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి అసోంకు బయలుదేరుతున్ననార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాత్రి బీహార్‌లో పట్టాలు తప్పింది. బీహార్‌లో బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో దాదాపు 21 కోచ్‌లు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఇప్పటికే నలుగురు మృతి చెందగా… 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లుగా తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో గాయపడిని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్… రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్‌కు (NDRF) తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడినివారికి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖకు సూచించినట్లు తెలుస్తోంది.
బీహార్ లో ఘోర రైలు ప్రమాదం (Bihar North East Express Train Accident):
Major Railway accident in Bihar's Buxar.
Several carriages of the train no. 12506, North East Express, en route from Delhi to Guwahati, have derailed, and rescue operations are underway.
Hats off to villagers who are saving lives at front 🙏#TrainAccident #NorthEastExpress pic.twitter.com/QmLlE9oBpd
— Saurav Mishra 🇮🇳 (@SauravmishraTV9) October 12, 2023
ALSO READ: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి