ఈరోజు సంగారెడ్డి లో జరిగిన జిల్లా నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గ సమావేశానికి నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నాయి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితునిగా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ (Beeraiah Yadav) హాజరయ్యారు.
ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని జిల్లా కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. అలాగే బీరయ్య యాదవ్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కులములో పుట్టిన కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతించారు. ఇది బీసీలకు గొప్ప గౌరవమని అన్నారు.
అంతేకాకుండా బీసీలకు, బీసీల్లోని అన్ని కులాలకు రాజకీయ వాటాలు తగిన రాజకీయ వాటా రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
అలాగే మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేయుటకు బరిలో ఉంటున్నానని… నాయి బ్రాహ్మణ సోదరులందరూ నాయి బ్రాహ్మణ సంఘం తమకు మద్దతు ఇవ్వాలని కోరగా జిల్లా కార్యవర్గం, రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ గారు వారు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వారి సంఘం తరఫున ఏకగ్రీవ తీర్మానాన్ని బీరయ్య యాదవ్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తే తమ సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని వారు తెలిపారు.
నాయి బ్రాహ్మణ సంఘం మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయి గారికి జిల్లా కమిటీ అధ్యక్షులు నాగభూషణం ప్రధాన కార్యదర్శి రాజారామ్ నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం, సత్తయ్య గార్ల కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ALSO READ: మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించాలి – BRS రాష్ట్ర సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్!