కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం మహిళా ఎంపీలతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి లోక్‌సభ పని చేయడానికి “ఆకర్షణీయమైన ప్రదేశం” అంటూ ట్వీట్ చెసారు. అతను ట్వీట్ చేసిన కాసేపట్లోనే నెటిజన్లు ట్రోలి౦గ్ మొదలుపెట్టారు.
ఇప్పుడు వైరల్‌గా మారిన తన పోస్ట్‌లో, బారామతి ఎంపీ సుప్రియా సూలే, పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్, దక్షిణ చెన్నై ఎంపీ తమిజాచి తంగపాండియన్, జాదవ్‌పూర్ ఎంపీ మిమీ చక్రవర్తి, బసిర్‌హత్ ఎంపీ నుష్రత్ జహాన్, కరూర్ ఎంపీ ఎస్ జోతిమణిలతో థరూర్ సెల్ఫీ దిగారు.
ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో తన తోటి మహిళా ఎ౦పీలతో దిగిన ఫోటో షేర్ చేసి, కాప్షన్ లో ఉపయోగించిన పదాలకు కొతమ౦ది నెటిజన్లు అది “అగౌరవం” అని భావిస్తూ, ప్రతికూల౦గా స్ప౦ది౦చారు.
“లోక్‌సభ పని చేయడానికి ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు? ఈ ఉదయం నా తోటి ఎంపీలు ఆరుగురితో” అని శశి థరూర్ తన ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడ౦ అతని పోస్టులో చూడొచ్చు.
Who says the Lok Sabha isn’t an attractive place to work? With six of my fellow MPs this morning: @supriya_sule @preneet_kaur @ThamizhachiTh @mimichakraborty @nusratchirps @JothimaniMP pic.twitter.com/JNFRC2QIq1
— Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021
అయితే, ఈ ఫోటోని పోస్ట్ చేసిన తర్వాత, శశి థరూర్ విమర్శల పాలయ్యారు. అతని ట్వీట్ ని ఉద్దేశిస్తూ “సెక్సిస్ట్” మరియు “అగౌరవం” అని కొందరు పేర్కొన్నారు.
అతని ట్వీట్ తో సోషల్ మీడియాలో చర్చ మొదలవ్వడ౦తో, శశి థరూర్ క్షమాపణలు చెప్తూ ఇద౦తా సరదాగా జరిగిందని చెప్పాడు. “మొత్తం సెల్ఫీ విషయం (మహిళా ఎంపీల చొరవతో) చాలా మంచి హాస్యంతో జరిగింది & అదే స్ఫూర్తితో ట్వీట్ చేయమని వారే నన్ను కోరారు. కొంతమంది బాధపడ్డందుకు నన్ను క్షమించండి, అయితే ఈ కార్యాలయంలో స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ఇదంతా అంతే” అని శశి థరూర్ ట్వీట్ చేశారు.
The whole selfie thing was done (at the women MPs' initiative) in great good humour & it was they who asked me to tweet it in the same spirit. I am sorry some people are offended but i was happy to be roped in to this show of workplace camaraderie. That's all this is. https://t.co/MfpcilPmSB
— Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి మరియు డిసెంబర్ 23న ముగిసే అవకాశం ఉంది. ఈ సెషన్‌లో, 26 బిల్లులు ప్రవేశపెట్టడానికి జాబితా చేయబడతాయి. ఇందులో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు మరియు అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు యొక్క క్రిప్టోకరెన్సీ మరియు నియంత్రణ ఉన్నాయి.