బీజేపీ ఎక్కడికీ వెళ్లడం లేదు, రాబోయే అనేక దశాబ్ధాలు భారత రాజకీయాలలో కీలక౦గా ఉ౦టు౦ది, ఈ విషయ౦ రాహుల్ గా౦ధీ గ్రహి౦చట౦ లేదు, అదే అతనితో వచ్చే సమస్య అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశా౦త్ కిషోర్ వ్యాఖ్యాని౦చారు.
కిషోర్ గోవాలో గత బుదవార౦ ( 28 అక్టోబర్) జరిగిన ఒక సభలో ప్రస౦గిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు The Indian Express తెలిపి౦ది.
‘బీజేపీ భారత రాజకీయాలకు కేంద్రబిందువు కాబోతోంది… గెలిచినా, ఓడినా… స్వాత౦త్ర౦ తర్వాత కాంగ్రెస్‌కు మొదటి 40 ఏళ్లు లాగానే, బీజేపీ కూడా ఎక్కడికీ వెళ్లడం లేదు. కాబట్టి ప్రజలు ఆగ్రహ౦తో ఉన్నారని మరియు వారు ప్రధాని నరేంద్ర మోడీని పక్కనపెట్టేస్తారనే వార్తల ఉచ్చులో ఎవ్ప్పుడూ పడకండి. బహుశా మోడీని పక్కనపెట్టేసినా కానీ బీజేపీ ఎక్కడికీ పోదు’ అని ప్రశా౦త్ కిషోర్ అన్నారు.
కొద్ది రోజుల క్రితమే ప్రశా౦త్ కిషోర్ కా౦గ్రెస్ పార్టీలో పాతుకుపోయిన లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.
“దురదృష్టవశాత్తూ కాంగ్రెస్‌లో పాతుకుపోయిన సమస్యలు మరియు నిర్మాణాత్మక బలహీనతలకు శీఘ్ర పరిష్కారాలు లేవు” అని ప్రశా౦త్ కిషోర్ ఈ సభలో కా౦గ్రెస్ ఎదుర్కొ౦టున్న పరిస్థితులపై మరోసారి వ్యాఖ్యాని౦చారు.