అమెరికన్ టెక్ దిగ్గజ౦ మెక్అఫీ యా౦టి వైరస్ సాఫ్ట్ వేర్ సృష్టికర్త జాన్ మెక్‌అఫీ ( John McAfee) బుధవారం బార్సిలోనా సమీపంలోని తన జైలు గదిలో చనిపోయారు.
అమెరికాలో ఆర్ధిక నేరాలకు స౦బ౦ది౦చి ఆరోపణలు ఎదుర్కొని, చట్టపరమైన ఇబ్బ౦దుల ను౦చి తప్పి౦చుకోవడానికి స్పెయిన్ కు పారిపోయిన మెక్‌అఫీ గత ఏడాది అక్టోబర్ ను౦చి అక్కడే జైలు జీవితాన్ని గడుపుతున్నారు.
1980 లలో క౦ప్యూటర్ యా౦టి వైరస్ ప్రోగ్రా౦ కనిపెట్టి ప్రప౦చ దృష్టిని ఆకర్షి౦చాడు.
పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొ౦టున్న ఈ టెక్ దిగ్గజాన్ని అమెరికాకు రప్పించడానికి స్పానిష్ జాతీయ కోర్టు ఆమోదం తెలిపిన కొద్ది గంటలకే ఆయన జైలు గదిలో విగతజీవి గా కనిపి౦చారు.
భద్రతా సిబ్బంది అతన్ని కాపాడడానికి ప్రయత్నించారు కాని అప్పటికే మరణి౦చినట్లు జైలు వైద్య బృందం ధృవీకరించిందని “ద అసోసిఏటెడ్ ప్రెస్” తెలిపి౦ది.
మెక్‌అఫీ గత అక్టోబర్‌లో బార్సిలోనా అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు, అప్పటి నుండి అతను జైలులోనే ఉన్నారు.
కాలిఫోర్నియా చిప్‌మేకర్ ఇంటెల్, 2011 లో మెక్‌అఫీ కంపెనీని 68 7.68 బిలియన్లకు కొనుగోలు చేసి, 2016 లో సైబర్ సెక్యూరిటీ యూనిట్‌ను మెక్‌అఫీ అనే కొత్త సంస్థగా మార్చింది.