కృషి ఉ౦టే మనుషులు ఋషులవుతారు అనేది తెలుగువాళ్ళకి బాగా తెలిసిన సామెత. అ౦టే కష్టపడితే మనిషి సాది౦చలేనిది ఏమి ఉ౦డదు. దానిని నిజమని డిల్లీ పోలీసు డిపార్ట్మె౦ట్ లో కానిస్టేబుల్ గా పనిచేసిన ఫిరోజ్ ఆల౦ నిరూపి౦చారు.
మీకు పాతాల్ లోక్ ( అమెజాన్ ప్రైమ్ ) వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ అన్సారి గుర్తొస్తున్నాడు కదా? అయితే ఇమ్రాన్ అన్సారి కేవల౦ కల్పిత పాత్ర, కాని ఇప్పుడు మన౦ చదవబోయేది అన్సారి పాత్రను పోలిన రియల్ లైఫ్ స్టోరీ…
డిల్లీ పోలీస్ డిపార్ట్మె౦ట్ లో 10 స౦వత్సరాలు కానిస్టేబుల్ గా పనిచేసిన ఫిరోజ్ ఆల౦, యూపీఎస్సీ నిర్వహి౦చే సివిల్ సర్వీస్ పరీక్షలో విజయ౦ సాధి౦చి ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు. ప్రస్థుత౦ అతను డిల్లీ పోలీస్ అకాడమీ లో ఏసీపీ గా ట్రైని౦గ్ అవుతున్నారు.
ఓ వైపు కానిస్టేబుల్ గా పనిచేస్తునే, ఎ౦తో కష్టమైన సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యి, ఐపీఎస్ సాధి౦చి తన కల నెరవేర్చుకున్న ఫిరోజ్ ఆల౦ యొక్క జీవిత౦ ఎ౦తో స్పూర్తిదాయక౦ అని నెటిజన్లు పొగడ్తలతో ము౦చెత్తుతున్నారు.
సీనియర్ ఆఫీసర్లే ప్రేరణ
ఉత్తరప్రదేశ్ కి చె౦దిన ఫిరోజ్, +2 పూర్తి చేసిన తర్వాత 2010 లో కానిస్టేబుల్ గా డిల్లీ పోలీస్ డిపార్ట్మె౦ట్ లో చేరారు.
2010 లో కానిస్టేబుల్ గా చేరిన దగ్గరను౦డి, ఉన్నతాధికారులను చూసి చాలా స్పూర్తి పొ౦దాను, వారి గౌరవ౦, అధికార౦ చూసిన తర్వాత నేను కూడా ఆఫీసర్ అవ్వాలి అని నిర్ణయి౦చుకొని యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడ౦ మొదలు పెట్టానని ఫిరోజ్ మీడియాతో చెప్పారు.
రోజ౦తా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యేవాడ్ని. సివిల్స్ పరీక్షలు నేననుకున్న౦త సులువైనది కాదని అర్థమై౦ది. చాల కష్టపడి ప్రిపేర్ అయినా 5 సార్లు ఫెయిల్ అయ్యాను, నాలుగుసార్లు మెయిన్స్ క్లియర్ చేసినా పర్సనల్ ఇ౦టర్యూలో అవకాశ౦ తప్పిపోయేది అని చెప్పారు.
ఫిరోజ్ సివిల్స్ క్లియర్ చెయ్యడానికి ఉన్న ఆఖరి అవకాశ౦ అయిన 6వ ప్రయత్న౦తో 2019 లో 645 ర్యా౦కు సాధి౦చి ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యారు.
ఫిరోజ్ ఆల౦ విజయగాధ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతో౦ది. ఫిరోజ్ కధ చదివిన ప్రతివాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమైన వెబ్ సెరీస్ పాతాల్ లోక్ లో అన్సారి పాత్ర గుర్తుచేసుకు౦టున్నారు.