భరత దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మేనకా గురుస్వామి (Menaka Guruswamy) తొలిసారి రాజ్యసభ సభ్యురాలిగా (MP) ఏప్రిల్ 6న ప్రమాణ స్వీకారం చేసి దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆమె దేశంలో తొలి ఓపెన్‌గా క్వియర్ (India’s first openly queer MP) ఎంపీగా నిలిచారు.
ఈ ప్రమాణ స్వీకారం కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. ఇది భారతదేశంలో సమానత్వం మరియు హక్కుల కోసం పోరాడుతున్న ఎంతోమంది మంది LGBTQ+ సమాజానికి ఒక గొప్ప గుర్తింపుగా చెప్పవచ్చు.
Trinamool Congress (TMC) ఆమెను నామినేట్ చేయగా, West Bengal నుంచి ఏకగ్రీవంగా (ఎటువంటి పోటీ లేకుండా) రాజ్యసభకు ఎన్నికయ్యారు. భారత పార్లమెంట్‌లో ఓపెన్‌గా LGBTQ+గా తనను గుర్తింపుచేసుకున్న తొలి వ్యక్తిగా మేనకా గురుస్వామి నిలిచారు.
మేనకా గురుస్వామి ప్రమాణ స్వీకారం తర్వాత దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. అలాగే రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
ఎందుకు ఇది చారిత్రాత్మకం?
మేనకా గురుస్వామి ప్రమాణ స్వీకారం LGBTQ+ సమాజానికి ఒక భారీ విజయం అనే చెప్పాలి. భారతదేశంలో ఇప్పటి వరకు ఈ వర్గానికి పార్లమెంట్‌లో ప్రత్యక్ష ప్రాతినిధ్యం లేకపోవడం ఒక పెద్ద లోటు. అయితే ఈ సందర్భంలో ఆమె పార్లమెంట్‌లో ప్రవేశం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
గతంలో Navtej Singh Johar vs Union of India కేసులో మేనకా గురుస్వామి కీలక పాత్ర పోషించారు. ఈ కేసు ద్వారా భారతదేశంలో సమలైంగిక సంబంధాలను నేరంగా ప్రకటించిన సెక్షన్ 377ను రద్దు చేశారు.
మేనకా గురుస్వామి ఎవరు? (Who is Menaka Guruswamy)
మీడియా సమాచారం, వార్త కథనాల ప్రకారం… మేనకా గురుస్వామి భారతదేశానికి చెందిన ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మరియు రాజ్యాంగ న్యాయ నిపుణురాలు. ఆమె మానవ హక్కులు, లింగ సమానత్వం మరియు స్వేచ్ఛా హక్కుల కోసం పోరాడే ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు.
Navtej Singh Johar vs Union of India కేసు ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఈ చారిత్రాత్మక కేసులో ఆమె కీలక పాత్ర పోషించి, సమలైంగిక సంబంధాలను నేరంగా ప్రకటించిన సెక్షన్ 377ను రద్దు చేయడంలో సహకరించారు. ఈ తీర్పు భారతదేశంలో LGBTQ+ సమాజానికి ఒక కొత్త దిశను చూపించింది.
ఆమె న్యాయవాదిగా మాత్రమే కాకుండా, సామాజిక న్యాయం కోసం కృషి చేసే కార్యకర్తగా కూడా పేరుగాంచారు.
తొలి క్వియర్ ఎంపీగా మెనక గురుస్వామి (Menaka Guruswamy – India’s first openly queer MP)
🚨 Menaka Guruswamy Takes Oath As MP India gets first openly queer parliamentarian Historic Rajya Sabha oath marks milestone for LGBTQ representation pic.twitter.com/EdoiaCUCG6
— Genzdigest (@genzdigest) April 6, 2026
Dr. Menaka Guruswamy (West Bengal nominated by Trinamool Congress is sworn in as a Rajya Sabha member, becoming India’s first openly queer Member of Parliament. pic.twitter.com/690hQ4ydsf
— Akashdeep Thind (@thind_akashdeep) April 6, 2026




