నీట్ పరీక్షల లీకేజీకి (NEET) నిరసన తెలుపుతూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల నేడు (గురువారం) బంద్‌కు (Bharat Bandh- Schools and Colleges Closed) పిలుపునిచ్చాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు కోరినట్లు సమాచారం.
నీట్ పేపర్ లీక్ అయినా సంగతి అందరికి తెలిసినదే. అయితే ఈమేరకు నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలైన ఎస్ఐఎఫ్ (SFI), ఎఐఎస్ఎఫ్(AISF), పీడీఎస్‌యూ(PDSU), పీడీఎస్ఓ(PDSO), ఎన్ఎస్‌యూఐ(NSUI) జులై 4న దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెల్సుతోంది.
అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)ని రద్దు చేయాలని… అలాగే కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు.
ఇదిలావుండా నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనలు, దేశవ్యాప్తంగా విద్యార్థలు నిరసనలపై మొదటి సరి ప్రధాని నోరు విప్పారు. పేపర్ లీకేజీ విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలుస్తున్నామని. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు వంతంగా సాగుతోందని… లక్షలాది విద్యార్థుల కష్టాన్ని వృధా కానివ్వమని ప్రధాని మోడీ స్పష్టం చేస్తారు.
విద్యాసంస్థలు బంద్ (Bharat Bandh- Schools and Colleges Closed):
నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్.. ఏపీ, తెలంగాణలోనూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు.. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా బంద్‌కు పిలుపు.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి, యువజన సంఘాలు#NEET #NEETUGUPDATE #neet2024scam #BharatBandh
— NTV Breaking News (@NTVJustIn) July 4, 2024
ALSO READ: YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత