Indiramma Universal Basic Income Support Scheme: ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5000 (Rs 5000 per month to every Poor Family) చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
తెలంగాణలో ఆరు గ్యారంటిలతో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన విషయం తెలిసినదే. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ ఏపీ లోను అమలు చేయనున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా ఇవాళ అనంతపురంలో జరిగిన న్యాయసాధన సభలో కాంగ్రెస్ పార్టీ, ఏపీలో అమలు చేసే తొలి గ్యారంటీ హామీని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తాము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ (Indiramma Universal Basic Income Support Scheme) పథకం తీసుకొస్తామని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలాగే ఏపీ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ: 5000 చొప్పున ఇస్తాం అని ఖర్గే అన్నారు. అయితే ఇది మోదీ లాంటి గ్యారెంటీ కాదని ఎద్దేవా చేశారు.
ఈ సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర నేతలు పాల్గొనడం జరిగింది.
అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఫలించిన ఈ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టో ఏపీ లో కూడా పని చేస్తుందా లేదా బోల్తా కొడుతుందో వేచి చూడాలి.
రూ: 5000 ఇస్తాం (Rs 5000 per Poor Family):
Indiramma Universal Basic Income support of ₹5000 per month to every poor family is Congress party’s guarantee for the people of Andhra Pradesh.
We will transfer the amount directly in the bank account of the woman of the families.
Our guarantee is not like “Modi Ki… pic.twitter.com/oR8PLIIPYC
— Mallikarjun Kharge (@kharge) February 26, 2024
ఏపీ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్!
ఏపీలో కాంగ్రెస్ గెలిస్తే ప్రతి నెలా, ప్రతి కుటుంబానికి రూ.5000 ఇస్తాం
ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.5,000 ఇస్తామని మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. pic.twitter.com/UAMV0LAs6A
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2024
ALSO READ: రూ: 500 గ్యాస్ సిలిండర్… గైడ్‌లైన్స్ ఇవే