తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం (Swetha Patram released in Telangana Assembly) విడుదల చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజ్. అయితే దురదృష్టవశాత్తు నాణ్యత లోపం వల్ల కుంగిపోయిందని. ఈ మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీని విచారణ జరిపించాలని కోరామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
అలాగే మేడిగడ్డ బ్యారేజ్ కోసం 1800 కోట్లకు టెండర్ పిలిచారని..కానీ అది 4500 కోట్లకు పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
శ్వేతపత్రం విడుదల (Swetha Patram released in Telangana Assembly):
తెలంగాణ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ#TelanganaAssembly
— NTV Breaking News (@NTVJustIn) February 17, 2024
ALSO READ: ఆరు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి జైలుకి: పాడి కౌశిక్ రెడ్డి