తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హుక్కా పార్లర్ల నిర్వహణను నిషేధిస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సోమవారం బిల్లును ఆమోదించింది.(Hookah Parlours Ban in Telangana).
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్‌మెంట్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ను ఎలాంటి చర్చలేకుండానే సభ ఏకగ్రీవంగా ఆమోదించడం హమానార్హం. ఈ నేపథ్యంలో ఈ బిల్లు పాస్ అయినట్టుగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించడం జరిగింది.
సభలో బిల్లు ఆమోదం పొందటంతో.. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా సెంటర్లు మూతపడనున్నట్లు తెలుస్తోంది.
యువతను మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మరియు సిగరెట్ పొగ కంటే హుక్కా మరింత హానికరమంటూ ఆయన వివరించారు.
తెలంగాణలో హుక్కా బ్యాన్ (Hookah Parlours Ban in Telangana):
తెలంగాణలో హుక్కా బ్యాన్ 🚫
యువతకి వ్యసనంగా మారుతుంది అని నిషేధించిన ప్రభుత్వం. 👏👏— Actual India (@ActualIndia) February 12, 2024
Telangana Legislative Assembly unanimously passed a bill banning hookah parlours in the state today.
— ANI (@ANI) February 12, 2024
ALSO READ: సీఎం రేవంత్ రెడ్డి కి సుప్రీంకోర్టు నోటీసులు