తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది (Supreme Court Notice to CM Revanth Reddy). ఓటుకు నోటు కేసులో క్రిమినల్ విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు మార్చాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ మేరకు పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ… తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తదితరులకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నాలుగు వారాలలో ఈ నోటీసుల పై స్పందించాలంటూ సూచనలు.
గతంలో ఓటుకు నోటు కేసులో (Note for Vote case) రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసినదే. స్టీఫెన్సన్ ను కలిసి రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తున్నట్లుగా వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేసారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నేళ్లు జైలులో ఉండగా… అనంతరం బెయిల్ మీద బయటకి రాగ కేసు కూడా మరుగున పడిపోయింది.
అయితే తాజాగా ఈ కేసు వ్యవహారం మళ్ళీ తెరపైకి రావడంతో… రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇప్పుడీ వార్త చర్చనీయాంశంగా మారింది.
రేవంత్ రెడ్డి కి నోటీసులు(Supreme Court Notice to Revanth Reddy):
తెలంగాణ న్యూస్ :
బిగ్ బ్రేకింగ్ న్యూస్ :
సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు…ఓటుకు కోట్లు కేసులో నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు…
నాలుగు వారాల్లోగా స్పందించాలంటూ నోటీసులు..
2015 లో రేవంత్ రెడ్డి పై ఓటు కి కోట్లు కేసు …
చంద్రబాబు ఆదేశాలతో స్టీఫెన్సన్ కు 50… pic.twitter.com/3u8ksdohnw
— Anitha Reddy (@Anithareddyatp) February 9, 2024