తెలంగాణలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా (Babu Mohan Quits BJP) చేశారు. ఈ విషయాన్ని బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఆయన విమర్శలు చేశారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వేరే పార్టీలో చేరతారా..? అని మీడియా ప్రశ్నించగా.. దానిపై ఇంకా ఆలోచించలేదని బాబూ మోహన్ బదులిచ్చారు.
బీజేపీ కోసం తాను చాలా కష్టపడి పనిచేశానని… కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తనను కొందరు పార్టీ నేతలు అవమానించారని అయన ఆరోపించారు.
అలాగే ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని… జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
అయితే మీడియా కధనం ప్రకారం బాబూమోహన్ వరంగల్ ఎంపీ టికెట్‌ను ఆశించినట్లు తెల్సుతోంది. అయితే, అందుకు బీజేపీ పార్టీ నిరాకరించిందని సమాచారం. ఆ అసంతృప్తితోనే ఆయన బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.
బీజేపీకి బాయ్ బాయ్ (Babu Mohan Quits BJP):
బీజేపీ పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు అందుకే రాజీనామ చేస్తున్న..! Babu Mohan#Telangana #BJP #BabuMohan #BandiSanjay #NTVNews #NTVTelugu pic.twitter.com/3PGUvFRJ2U
— NTV Telugu (@NtvTeluguLive) February 7, 2024
బీజేపీకి బాబూమోహన్ రాజీనామా
కిషన్ రెడ్డి తన ఫోన్ ఎత్తకుండా అవమానిస్తున్నారని ఆగ్రహం
అంధోల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి 2018లో 2,404, 2023లో 5,524ఓట్లు తెచ్చుకుని డిపాజిట్లు పోగొట్టుకున్న బాబూమోహన్ #BJP pic.twitter.com/G5piDTpBAR
— Telugu360 (@Telugu360) February 7, 2024
ALSO READ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కే.ఏ.పాల్ ఫైర్