విశాఖపట్నం వేదికగా నేటి నుంచి భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది (IND vs ENG 2nd Test). ఈ మ్యాచ్ లో తొలుత భారత్ టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకుంది.
తొలి టెస్ట్ లో అకాహారి వరకు పోరాడి ఓటమి పాలయిన భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఐదు మ్యాచ్ ల సిరీస్ ని 1-1 తో సమం చేయాలని భావిస్తోంది. అయితే తొలి మ్యాచ్ లో ఆతిధ్య భారత్ జట్టు ను ఓడించి రెట్టింపు ఉత్సాహంతో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో కూడా విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్ ను లీడ్ లో ఉంచాలని తహతహలాడుతోంది.
అయితే గాయాల కారణంతో రెండో టెస్ట్ మ్యాచ్ కు కె.ఎల్.రాహుల్ మరియు జడేజా భారత్ జట్టుకు దూరం కాగా ఇంగ్లాండ్ జట్టులో జాక్ లీచ్ దూరం అయ్యాడు. వీరే స్థానాలలో భారత్ తరపున రజిత్ పాటిదార్, ముకేశ్ కు తుది జట్టు లో చోటు దక్కింది. ఇకపోతే ఇంగ్లాండ్ జట్టులో జాక్ లీచ్ స్థానంలో బషీర్ కు అవకాశం లభించింది.
భారత్ తుది జట్టు:
రోహిత్, జైస్వాల్, గిల్, శ్రేయాస్, పాటిదార్, అక్షర్, భరత్, అశ్విన్, కుల్దీప్, ముకేశ్, బుమ్రా
ఇంగ్లాండ్ తుది జట్టు:
క్రాలి, డకేట్, పోప్, రూట్, బైర్ స్టో, స్టొక్స్, ఫోక్స్, రెహాన్, హార్ట్లే , బషీర్, ఆండర్సన్
భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్ట్ (IND VS ENG 2nd Test)
India have won the toss and they've decided to bat first. pic.twitter.com/KG4m0eiQo7
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2024
Patidar, Kuldeep and Mukesh Kumar replace KL, Jadeja and Siraj. pic.twitter.com/M2tkZyZJfL
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2024
ALSO READ: భారత్ పేసర్ మొహమ్మద్ షమీ కి అర్జున అవార్డు