బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆరు నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడతారు అని కేటిఆర్ విమర్శించారు (KTR Comments on Congress Party).
హైదరాబాద్, తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అని కేటిఆర్ అన్నారు. మరియు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సూచించారు.
ఇకపోతే తెలంగాణ ఎన్నికలకు ముందు రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్‌రెడ్డి అనగా… ఇప్పుడేమో దశలవారీగా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ.. అదానీకి దేశ సంపదను దోచి పెడుతున్నారని రేవంత్ విమర్శలు చేశారు. ఇప్పుడు దావోస్ సాక్షిగా అదానీతోనే అలయ్ బలయ్ అవుతున్నారు. కేవలం బీజేపీ ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి అదానితో కలిసి పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
అలాగే “నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం.. కేవలం బీఆర్ఎస్ పార్టీయే” అని కేటీఆర్ ప్రశంసించారు.
ఆరు నెలల్లో కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడతారు (KTR Comments on Congress Party):
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు – KTR#KTR #BRS #CMRevanthReddy #Congress #Telangana #NTVNews #NTVTelugu pic.twitter.com/lLGy7w173N
— NTV Telugu (@NtvTeluguLive) January 18, 2024