తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నించి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం ఫాం హౌస్ బాత్రూం లో కాలు జారిపడటంతో గాయపడిన కేసీఆర్ శస్త్ర చికిత్స తర్వాత శుక్రవారం డిశ్చార్జి (KCR Discharged) అయ్యారు. అనంతరం కేసీఆర్ ఆసుపత్రి నుంచి నేరుగా నందినగర్ లోని ఆయన తన నివాసానికి బయలుదేరి వెళ్లారు.
ఎడమ కాలి తుంటి ఎముక విరగడంతో తుంటి మార్పిడి సర్జరీ నిర్వహించారు. తుంటికి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు కొద్ది రోజుల పాటు కేసీఆర్ ను అబ్జర్వేషన్ లో ఉంచారు. మొత్తం ఎనిమిది రోజుల పాటు కేసీఆర్ ఆసుపత్రిలోనే ఉన్నారు.
ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ (KCR Discharge):
After a successful surgery, dad was discharged from the hospital today. Thanks to the doctors, nurses and staff who helped in every way possible.
All the warmth and love we received from across the country during this difficult time was very heartwarming to KCR garu and the… pic.twitter.com/0VTPKGUJ12— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2023
ALSO READ: కేసీఆర్ కు గాయం… యశోద ఆస్పత్రిలో చికిత్స