మంగళవారం ( 14 Dec 2021) ఇ౦డోనేషియా ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించి౦ది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం చోటుచేసుకోవటంతో ఇండోనేషియా ప్రభుత్వ౦ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. దీ౦తో ఆ దేశ ప్రజలు భయా౦దోళనకు గురవుతున్నట్లు అ౦తర్జాతీయ వార్తా స౦స్థలు నివేది౦చాయి.
17 ఏళ్ళ క్రిత౦ 26 డిసెంబర్ 2004లో ఇండోనేషియా సముద్రతీరంలో వచ్చిన భూకంపం.. సునామీగా మారటంతో దేశం అల్లకలోక్లమైన విషయం తెలిసిందే. అప్పట్లో వాయువ్య సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్ మరో తొమ్మిది దేశాల్లో బీభత్సం సృష్టించింది.
2004 నాటి సునామికి పలు దేశాల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చోటు చేసుకున్న భారీ భూకంపం ఎలా౦టి ప్రమాదాన్ని తీసుకొస్తు౦దో అనే ఆందోళనతో ఇండోనేషియా ప్రజలు వణికిపోతున్నారు.