టీ20 ప్రపంచ కప్ 2024 లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు జరిగిన వెస్ట్ ఇండీస్ వైస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ లో (WI vs SA) దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో వెస్ట్ ఇండీస్ ని ఓడించింది.
తోలుత టాస్ ఓడి బాటింగ్ కి దిగిన వెస్ట్ ఇండీస్ నిర్ణీత 20 ఓవర్లు లో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ చేస్ 52 పరుగులు,కే మేర్స్ 35 పరుగులతో రాణించగా మిగిలిన బ్యాటర్లు ఎవరు ఆకట్టుకోలేకపోయారు. అటు దక్షిణాఫ్రికా బౌలర్ల లో షమ్సీ 3 వికెట్లు తీసుకోగా…జాన్సెన్ ,మార్కరం ,మహారాజ్ మరియు రబడా తలొక వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా మొదటి రెండు ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్ తిరిగి డక్ వర్త్ లూయిస్ (DLS Method) ప్రకారం మ్యాచ్ ని 17 ఓవర్లకి 123 లక్ష్యంగా కుదించబడింది. తిరిగి ప్రారంభం అయినా మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఇంకో అయిదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి గెలుపు కైవసం చేసుకుంది .
మ్యాన్ అఫ్ ది మ్యాచ్ : షమ్సీ (4-0-27-3)
దక్షిణాఫ్రికా గెలుపు (T20 World Cup 2024 WI vs SA):
SOUTH AFRICA ARE THROUGH TO THE SEMI FINALS OF 2024 T20 WORLD CUP. 🏆 pic.twitter.com/XDTFmGzN5h
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2024
ALSO READ: T20 WC 2024 IND vs AUS: నేడు ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్