New Medical Colleges in Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్రం లో ఒకేసారిగా తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను కేసీఆర్ ప్రగతి భవన్ నించి వర్చ్యువల్ గా ప్రారంభించారు. ఏడాదికి తెలంగాణ రాష్ట్రంలో పది వేలమంది డాక్టర్లు తయారవుతున్నారు అని సీఎం సర్ అన్నారు.
కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలని ప్రారంభించారు. అంతే కాకుండా వచ్చే సంవత్సరం కొత్తగా మరో ౮ మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తాం అని సీఎం ప్రకటించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… దేశవైద్యరంగంలో ఇదొక సరికొత్త చరిత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే కొత్తగా అడ్మిషన్స్ పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
85 శాతం లోకల్ విద్యార్థులే:
అంతేకాకుండా 85 శాతం లోకల్ విద్యార్థులకే సీట్లు ఇస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. వచ్చే సంవత్సరం 8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 9 కాలేజీలను ప్రారంభించింది.
ఒక్కో కాలేజీలో 100 సీట్ల చొప్పున 900 ఎంబీబీఎస్ సీట్లు ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ప్రారంభించిన కాలేజీలతో కలిపి రాష్ట్రం లో మొత్తం ౮౫౧౫ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లుగా సీఎం తెలిపారు.
ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారతదేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని… pic.twitter.com/CWyIX2HSed
— Telangana CMO (@TelanganaCMO) September 15, 2023
A White Coat Revolution in Telangana! Watch Live: CM Sri KCR virtually inaugurating 9 new Medical Colleges. #ArogyaTelangana https://t.co/MLgM7csRbW
— Telangana CMO (@TelanganaCMO) September 15, 2023
Health is Wealth 💪
After having set a benchmark in the country as the state with Highest Per Capita Income, now Telangana is all set to achieve a new benchmarks in Health
Hon’ble CM KCR will be inaugurating 9 New Govt medical colleges on a single day today! A new White coat… pic.twitter.com/uMgucWeMgk
— KTR (@KTRBRS) September 15, 2023
ALSO READ: కమల తీర్థం పుచ్చుకోనున్న చికోటి ప్రవీణ్… నేడు భారీ ర్యాలీ