Telangana CM Revanth Reddy Oath Ceremony: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన తొలి సంతకాన్ని ఆరు గ్యారంటీ ఫైలుపై చేశారు. అలాగే దివ్యంగురాలు రజినికి ఉద్యోగం కల్పిస్తూ తన రెండో సంతకాన్ని చేశారు.
డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సమక్షంలో ప్రమాణం చేశారు. అలాగే మంత్రులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు.
ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతోపాటు ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. అంతేకాకుండా భారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం (CM Revanth Reddy Oath Ceremony):
Shri Anumula Revanth Reddy takes the oath as the CM of Telangana.
📍 Hyderabad pic.twitter.com/papjGQqBBe— Assam Congress (@INCAssam) December 7, 2023
ALSO READ: తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు: రాజాసింగ్