2012లో తన 25 ఏళ్ల కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా, తన కూతురు సజీవంగా ఉందని, కాశ్మీర్‌లో నివసిస్తోందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి లేఖ రాసి మరో స౦చలనానికి తెరలేపి౦ది.
సీబీఐకి పంపిన లేఖ ప్రకారం, తన తోటి ఖైదీ షీనాను కాశ్మీర్ లో కలిసి౦దని, షీనా కదలికలపై సీబీఐ దర్యాప్తు చేయాలని అభ్యర్థించారని మీడియా వర్గాల సమాచార౦.
The Indian Express ప్రకారం… ముఖర్జియా న్యాయవాది సనా రనీస్ ఖాన్ ఆమె సీబీఐకి లేఖ వ్రాసినట్లు ధృవీకరించారు, అయితే “ఆమె వ్రాసిన వాటికి సంబంధించిన వివరాలు మా వద్ద లేవు” అని తెలిపారు. డిసెంబరు 18న ట్రయల్ కోర్టు ముందు అధికారికంగా దరఖాస్తు చేయనున్నట్లు ఖాన్ తెలిపారు. ఇంద్రాణి బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు గత నెలలో తిరస్కరించింది.
అయితే 49 ఏళ్ళ ఇంద్రాణి ముఖర్జీ, తన కుమార్తె షీనా బోరాను 15 ఆగస్టు 2015న హత్య చేసిన కేసులో ఖర్ పోలీసులు అరెస్టు చేశారు మరియు సెప్టెంబర్ 2015 నుండి బైకుల్లా మహిళా జైలులో ఉన్నారు. ఆమెను అరెస్టు చేసిన మూడు నెలల తర్వాత ఆమె భర్త పీటర్ ముఖర్జీని కూడా అరెస్టు చేశారు. ఇంద్రాణి హత్యకు సహకరించారనే అభియోగాలు మోపినప్పటికీ 2020 లో అతను బెయిల్ పై విడుదల అయిన స౦గతి తెలిసి౦దే.
ఇంద్రాణి డ్రైవర్ శ్యాంవర్ రాయ్ తుపాకీతో పట్టుబడడంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. విచారణలో హత్యను తాను ప్రత్యక్షంగా చూసినట్లు వెల్లడించాడు. ముంబైలోని బాంద్రాలో ముఖర్జీ షీనాను గొంతు కోసి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని పొరుగున ఉన్న రాయ్‌గఢ్ జిల్లాలో పారవేసినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అయితే, ముఖర్జీ ఆ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు.