SBI KYC Update 2021:
మీరు ఎస్‌బీఐ ఖాతాదారులు అయితే వెంటనే మీ కెవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి, లేకపోతే మీ ఖాతా తాత్కాలికంగా పనిచెయ్యకపోయే అవకాశం ఉంది.
వినియోగదారులు అందరూ కేవైసీ వివరాలను 2021 మే 31 లోగా అప్‌డేట్ చేయాలని కోరుతూ ట్విట్టర్ ద్వారా ఎస్‌బీఐ తమ కస్టమర్లకు సమాచారం ఇచ్చింది. ఈ ట్వీట్ మే 1న చేసినట్లు తెలుస్తో౦ది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కస్టమర్లు పోస్ట్ లేదా ఈ-మెయిల్ ద్వారా తమ కేవైసీ వివరాలను బ్యాంకుకు పంపవచ్చు అని తెలిపింది.
Important announcement for our customers in view of the lockdowns in place in various states. #KYCUpdation #KYC #StayStrongIndia #SBIAapkeSaath #StaySafe #StayStrong pic.twitter.com/oOGxPcZjeF
— State Bank of India (@TheOfficialSBI) May 1, 2021
అయితే కస్టమర్లు తమ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్ నుంచే మాత్రమే కేవైసీ డాక్యుమెంట్స్ పంపాల్సి ఉంటుంది. ఖాతాదారులు ప్రభుత్వం చేత గుర్తింపబడిన ఐడీ, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, NREGA కార్డ్, పాన్ కార్డ్ వాటిలో ఏదైనా స్కాన్ కాపీని మెయిల్ ద్వారా పంపవచ్చు. కానీ ఏ ఈమైల్ ఐడీకి ప౦పాలి అనేది ట్వీట్ లో తెలియజేయలేదు. పూర్తి వివరాలకోస౦, ఎస్‌బీఐ అధికారిక వెబ్ పోర్టల్ ను స౦దర్శి౦చ౦డి.
గుర్తు౦చుకో౦డి, కెవైసీ అప్‌డేట్ చెయ్యడానికి ఇ౦కా మూడురోజులు మాత్రమే గడువు ఉ౦ది.