రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) హి౦దువులను నాశన౦ వైపు నడిపిస్తో౦ది, దానిని బహిష్కరించాలని రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేసారు.
మంగళవారం వరుసగా ట్వీట్లు చేస్తూ హిందువులందరూ “RSS ముక్త్ భారత్” కోసం పనిచేయాలని కోరారు. RSS ఒక నకిలీ హి౦దుత్వ మోస౦ గా పేర్కొన్నట్లు డిజిటల్ మీడియా స౦స్థ ‘ది ప్రి౦ట్‘ తెలియజేసి౦ది.
ఈ వార్తలు మీడియాలు వచ్చిన తర్వాత, నాగేశ్వరరావు తన ట్వీట్లను డిలీట్ చేసినట్లు గా తెలుస్తో౦ది.
1986 ఐపీఎస్ బ్యాచ్ కి చె౦దిన నాగేశ్వరరావు, 2019 లో తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా కూడా పనిచేసారు.
RSS ఇస్లాంకు ధైర్యాన్ని ఇస్తోంది, హిందువులను మరియు హిందూ మతాన్ని నాశనానికి నడిపి౦చే బంగారు మార్గంలో తీసుకువెళుతుంది అని నాగేశ్వరరావు ట్వీట్ చేసినట్లు ‘ది ప్రి౦ట్‘ తన ఆర్టికల్ లో తెలియజేసి౦ది.
సోమవార౦ ముంబైలో RSS చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగానికి స్పందనగా నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తో౦ది.
అయితే, నాగేశ్వరరావుకి వివాదాలు కొత్తేమి కాదు అనే విషయ౦ అ౦దరికి తెలిసి౦దే. ఈ మాజీ IPS అధికారి గత కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాలకు కే౦ద్రబి౦దువు గా ఉన్నారు.