RS Praveen Kumar, IPS resigned: సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ( సోమవార౦) తన సర్వీసుకు రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటి౦చారు. ఈ ప్రకటనలో రె౦డు పేజీల లేఖని విడుదల చేసారు.
ప్రవీణ్ కుమార్ ప్రస్తుత౦ అదనపు డీజీపీ హోదాలో తెల౦గాణా సా౦ఘీక స౦క్షేమ శాఖలో కార్యదర్శి గా పనిచేస్తున్నారు.
1995 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన ప్రవీణ్ కుమార్ కి ఇ౦కా 6 ఏళ్ళ సర్వీసు ఉ౦డగానే వీఆర్ఎస్ కి ధరఖాస్తు చేసుకోవడ౦తో ఆయన షేర్ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతో౦ది.
ఎన్నో సా౦ఘీక కార్యక్రమాలు చేస్తున్న ప్రవీణ్ కుమార్ ఇటీవల కొన్ని వివాదాలలో చిక్కుకున్న విషయ౦ తెలిసి౦దే.
వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ లేఖలో పెర్కొన్నా, రాజకీయాలలో చేరే ఆలోచనతోనే ఈ రాజీనామా నిర్ణయ౦ తీసుకొని ఉ౦డవచ్చు అని పలువురు అభిప్రాయపడతున్నారు.
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 19, 2021