Nizamabad Kasturiba School Food Poision: నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూర్భా పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి భోజం చేసిన అనంతరం సుమారు వంద మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో వాంతులు చేస్కుని అస్వస్థతకు గురైయ్యారు
సంఘటనను గుర్తించిన పాఠశాల సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇంచార్జి ప్రత్యేక అధికారి శోభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన 80 మంది విద్యార్థినులను హుటాహుటిన నిజామాబాద్‌లోని ఆసుపత్రికి ప్రత్యేక చికిత్స కోసం తరలించారు.
15 మందిని ఐ.సి.యు లో, మిగతావారిని ఎమర్జెన్సీ వార్డ్ లోను చికిత్స అందిస్తున్నట్లుగా డాక్టర్ల సమాచారం.
విద్యార్థినుల పరిస్థితిని తెలుసుకున్న తల్లితండ్రులు ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తమ పిల్లల్లకు కలుషితమైన ఆహారాన్ని అందించిన వసతిగృహ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న అధికారులు ఫుడ్ సాంపిల్స్ ను సేకరించి, ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరాతీస్తున్నారు.
‘80 మంది పైగా విద్యార్థినులకు అస్వస్థత’
నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూర్భా పాఠశాలలో ఘటన !
More than 80 girls fell ill to food poisoning in Bhimgal Kasturba School, Nizamabad. pic.twitter.com/kkewOMsR0F
— Arvind Dharmapuri (@Arvindharmapuri) September 12, 2023
ALSO READ: ముంబైలో విషాదం, లిఫ్ట్ కూలి ఏడుగురు కార్మికులు మృతి