తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ… రాష్ట్రంలో నంది అవార్డు పేరును ఇకపై గద్దర్ అవార్డుగా మారుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది (Nandi awards name changed to Gaddar awards).
బుధవారం రవీంద్ర భారతిలో జరిగిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన జారీ చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం గద్దర్ జయంతి రోజున సినిమా అవార్డుల ప్రదానం ఉంటుందని ఆయన అన్నారు. అలగే కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఈ గద్దర్ అవార్డు ప్రకటిస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
నంది అవార్డులు ఇకపై గద్దర్ అవార్డులు (Telangana Govt changed Nandi awards name to Gaddar awards):
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా మార్పు. ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు. గద్దర్ జయంతి రోజు అవార్డులు ప్రదానం. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు ఇస్తాం. -రేవంత్ రెడ్డి.#BreakingNews #CMRevanthReddy
— NTV Breaking News (@NTVJustIn) January 31, 2024