హైదరాబాద్ లో నుమాయిష్ సందడి ప్రాంభమైంది. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 83వ నుమాయిష్‌ని (Nampally Numaish Exhibition 2024) తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ కనసాగనుండగా. ఇవాళ్టి నుంచి ప్రజలను ఎగ్జిబిషన్‌కు అనుమతిస్తారు. ఈ ఎగ్జిబిషన్‌కి ఎంట్రీ ఫీజు 40 రూపాయిలుగా నిర్ణయించారు.
సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి పదిన్నర వరకు అనుమతి ఉండగా. వీకెండ్స్‌లో మాత్రం రాత్రి 11 వరకు సందర్శనకు అనుమతి ఉన్నట్లు తెల్సుతోంది.
నుమాయిష్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలోనే హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చార్మినార్, ట్యాంక్‌బండ్ తర్వాత నుమాయిష్ అని తెలిపారు.
చలో నుమాయిష్ (Nampally Numaish Exhibition 2024):
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభం.. నుమాయిష్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు.. ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్.#Numaish #Revanthreddy #Hyderabad #Telangana #TeluguNews
— NTV Breaking News (@NTVJustIn) January 1, 2024
#HYDTPinfo #TrafficAlert
Commuters are requested to make note of the #Notification issued in view of #AllIndiaIndustrialExhibition at Exhibition Grounds, Nampally from 01.01.2024 to 15.02.2024 from 1600 hrs till midnight everyday. #TrafficRestrictions #TrafficDiversions #Numaish pic.twitter.com/61X2WhzqBj— Hyderabad Traffic Police (@HYDTP) January 1, 2024