వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో పవన్‍ను ఓడిస్తానని సవాల్ చేశాను… అయితే ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాలలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించడంతో ఓటమిని అంగీకరిస్తునానని. పవన్ పై తాను చేసిన సవాల్ లో ఓటమి చెందినందున పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోడానికి (Mudragada Padmanabam Name Change Padmanabha Reddy) సిద్ధం అవుతున్నానని ముద్రగడ మీడియా ద్వారా ప్రకటన చేశారు. అయితే ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు పిఠాపురంలో గెలిచేది వైసీపీ ప్రభుత్వమేనని. ఒకవేళ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పద్మనాభ రెడ్డిగా (Padmanabha Reddy) పేరు మార్చుకుంటానని ముద్రగడ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసినదే.
అయితే మొన్న వెల్లడైన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో పిఠాపురం నుంచి జనసేన పార్టీ తరపున పోటీచేసిన పవన్ కళ్యాణ్ 1,34,394 ఓట్లు దక్కించుకుని (70,279 ఓట్ల) మెజారిటీ తో అఖండ విజయం సాధించారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కు పోటీగా వైసీపీ నుంచి పోటీ చేసిన వంగా గీత కేవలం 64,115 ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగారు.
పేరు మార్చుకుంటున్నాను (Mudragada Padmanabha Reddy):
“I have lost my challenge against Pawan Kalyan and I accept that it is my defeat!!
I am applying to change my name to Padmanabha Reddy, I will soon change my name and come before the media!!
– Mudragada Padamanabam” pic.twitter.com/N8YEtn6l3E
— idlebrain jeevi (@idlebrainjeevi) June 5, 2024
ALSO READ: Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్