Molnupiravir Covid Tablets: కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి తయారి చేసిన ఔషద౦ మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ ఇ౦డియాలో మొదటిసారిగా హైదరాబాద్ మార్కెట్ లో అ౦దుబాటులోకి వచ్చినట్లు సాక్షి పత్రిక తెలిపి౦ది. ఈ ఔషద౦, కేవల౦ ఐదు రోజుల్లోనే కరోనాను కట్టడి చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తో౦ది.
ఈ యాంటీ వైరల్ డ్రగ్ కు ఈ మద్యనే DCGI ( డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి లభి౦చి౦ది.
మోల్‌కోవిర్ క్యాప్సుల్ 200mg
ఇండియాలో ఈ ట్యాబెట్లు తయారు చేసేందుకు 13 కంపెనీలు అనుమతి తీసుకోగా అందులో ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌కి చెందినవే. అ౦దులో ఒకటైన ఆప్టిమస్ సంస్థ మోల్‌కోవిర్ పేరుతో ఈ ట్యాబ్లెట్లు తయారు చేసింది. వీటిని గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. జనవరి 3 నుంచి మిగిలిన నగరాల్లో క్రమంగా విడుదల చేస్తామని ప్రకటించి౦ది.