నేటి నుంచి విశాఖలో మిలన్ 2024

Date:

Share post:

సాగర తీరాన మిలాన్ సందడి చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వేదికగా నేడు మిలాన్-2024 (Milan 2024 Visakhapatnam) ప్రారంభం కానుంది. ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్న ఈ విన్యాసాల కోసం 50 దేశాల నుంచి ప్రతినిధులు, 20కి పైగా యుద్ధ నౌకలు, విమానాలు విశాఖపట్నం హార్బర్ కు చేరుకొనునట్లు సమాచారం.

అయితే ఇప్పటికే వీటిలో కొన్ని విశాఖపట్నం హార్బర్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. మిత్ర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి గాను అలాగే సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి కోసం రెండేళ్లకు ఒకసారి ఇండియన్ నేవీ ఈ మిలాన్ (Milan 2024 Vizag) వేడుక నిర్వహిస్తోంది.

తొలిసారిగా మిలన్-2024 లో INS విక్రమాదిత్య (INS Vikramaditya) మరియు INS విక్రాంత్‌ (INS Vikrant) తో సహా భారత నౌకాదళానికి చెందిన రెండు విమాన వాహక నౌకలు పాల్గొనున్నాయి.

విశాఖలో మిలన్-2024(Milan 2024 Visakhapatnam):

ALSO READ:సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం… బీఆర్ఎస్ ఆగ్రహం

Newsletter Signup

Related articles