నేను మళ్లీ వస్తున్నానంటూ… తెగ ప్రచారం చేసుకుంటున్నారు… భూవివాదంలో పోలీసు కేసు నమోదై ముద్దాయిగా ఉన్న ఇన్స్‌పెక్టర్ దయాకర్. మళ్లీ నా టైమ్ వచ్చేసింది… నేను రంగంలోకి దిగుతున్నాను… అని తన సర్కిల్‌తో విషయం షేర్ చేసుకుంటున్నారు….!
గత ఏడాది హన్మకొండ వికాస్ నగర్ లోని ఓ స్థలం విషయంలో సీఐ దయాకర్ జోక్యం చేసుకుని తుపాకీతో బాధితుడిని బెదిరించిన్నట్లుగా ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు సిఐ దయాకర్ ముద్దాయిగా మారిన సంగతి తెలిసిందే.
భూవివాదంలో ఓ వ్యక్తిని బెదిరించిన హన్మకొండ సిఐ దయాకర్
బాధితుడి ఫిర్యాదు ములుగు మచ్చాపురానికి చెందిన రవీందర్ రెడ్డికి, నయీం నగర్ ప్రేమ్ నగర్ కాలనీకి చెందిన సోదా కిరణ్ కు మధ్య వికాస్ నగర్ లోని ఒక స్థలం విషయంలో వివాదం నెలకొని ఉంది. కిరణ్ తన పలుకుబడితో రవీందర్ రెడ్డి ని హనుమకొండ పోలీస్ స్టేషన్ కు పిలిపించి బలవంతంగా సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నించి…
సంతకం పెట్టుకుంటే సీరియస్ గా ఉంటుందని బెదిరించి కొట్టినట్లుగా రవీందర్ రెడ్డి అప్పటి వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు అప్పటి సీపీకి నివేదిక ఇచ్చారు.ఈ నివేదిక ఆధారంగా సీఐ దయాకర్ తో పాటు, సోదా కిరణ్, అతని డ్రైవర్ చారి, మరో వ్యక్తిపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
సీపీ ప్రమోద్ కుమార్… ఆదేశాలతో సిఐ పై హత్యాయత్నం, దారిదోపిడి కేసులు కూడా నమోదయ్యాయి , భూ వివాదంలో తలదూర్చినందుకు హనుమకొండ సిఐ దయాకర్ ను ఏఆర్ విభాగానికి అటాచ్ చేస్తూ సి పి ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి చాలా కామ్ ఉన్న సీఐ దయాకర్… ప్రమోద్‌కుమార్ బదిలీ అవగానే మళ్లీ తమ స్వభావాన్ని బయటపెట్టడం మొదలుపెట్టారు.
ఓ మంత్రి ద్వారా తీవ్ర ప్రయత్నం చేసిన తాను….. మళ్లీ తిరిగి వస్తున్నానని… వరంగల్ లో తెగ చాటుకుంటున్నారని భోగట్టా. పాత కమిషనర్ నిర్ణయంతో ఏఆర్‌లో ఆటాట్‌లో ఉన్న దయాకర్‌పై కొత్త కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరుణ్ జోషీ ఎలా వ్యవహరిస్తారో…. వేచిచూడాల్సిందే.