Jharkhand Train Accident: జార్ఖండ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ డివిజన్ సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు (Howrah CSMT Express Derailed) తప్పింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతో చెందగా.. సుమారు 60 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మీడియా సమాచారం ప్రకారం… చక్రధర్పూర్ వద్ద తెల్లవారుజామున 3:45 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పుగా అదే లైన్ లో వస్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ బోగీలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెల్సుతోంది. దీంతో హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు 18 భోగీలు పట్టాలు తప్పాయి.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రైల్వే సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
రైలు ప్రమాదం (Jharkhand Train Accident):
జార్ఖండ్: చక్రధర్పూర్ సమీపంలో పట్టాలు తప్పిన హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్. #Jharkand #HowaraCSMTexpress #ChakradharpurTrainDetrailent #NewsUpdates #Bigtvlive pic.twitter.com/Ha6KGHHnb7
— BIG TV Breaking News (@bigtvtelugu) July 30, 2024
ALSO READ: Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం