Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కారిడార్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా డిసెంబర్ 9న సీఎం శంఖుస్థాపన చేయనున్నారు.
రానున్న మూడు సంవత్సరాలల్లో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనున్నదని సీఎం తెలిపారు.
ఈ మెట్రో బయో డైవర్సిటీ జంక్షన్ కాజాగూడా రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్దగల నానక్ రామ్ గూడ జంక్షన్ ను తాకుతూ వెలుతుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా (Right of way) మెట్రో రైలు నడుస్తుంది.
మొత్తం 31 కిలోమీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టు ను రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నది. ఈ మార్గం వెంట పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాయి.
Source: Telangana CMO Official Facebook Page