దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గోవులు వాటి పేడ, మూత్రం కీలక పాత్ర పోషిస్తాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు.
“ఆవులు లేదా ఎద్దు లేకుండా చాలా పనులు ముందుకు సాగవు. అందువల్ల, అవి చాలా కీలకమైనవి. ఆవులు, వాటి పేడ మరియు మూత్రం సరైన వ్యవస్థను ఏర్పాటు చేస్తే రాష్ట్రం మరియు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి, ”అని భోపాల్లో జరిగిన ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ మహిళా విభాగం సమావేశంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
#WATCH | Cows, their dung and urine can help strengthen the economy of the state and the country if a proper system is put in place," says Madhya Pradesh CM Shivraj Singh Chouhan while addressing a convention of the women’s wing of Indian Veterinary Association in Bhopal pic.twitter.com/Mf2yvmYsf0
— ANI (@ANI) November 13, 2021
“మేము మా వంతు సాయ౦ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రంగంలో మహిళల సహకారంతో, విజయం సాధిస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆవు పేడ మరియు మూత్రం నుండి, మీరు పురుగుమందుల నుండి అనేక రోగాలకు ఔషధాలు తయారు చేయవచ్చు.
గత సంవత్సరం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం గోవుల సంరక్షణ మరియు ఆవు ఉత్పత్తులను ప్రోత్సహించడానికి పని చేసే ఆరు శాఖల మంత్రులతో “గావ్ క్యాబినెట్” ని సిద్ధ౦ చేసి౦ది.
మధ్యప్రదేశ్లో 2018 అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా గోవులపై దృష్టి పెట్టింది, ప్రతి పంచాయతీలో గోశాలలను నిర్మిస్తామని మరియు గోమూత్ర (ఆవు మూత్రం) వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. మరెన్నో గోసంరక్షణ కేంద్రాలను నిర్మిస్తామని, వాటి సంరక్షణ మరియు నిర్వహణకు నిధులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.