నోయిడాలో కట్టబోయే ‘జెవార్ విమానాశ్రయ౦’ మోడల్ అని చెప్తూ ‘బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ యొక్క ఫోటోలను పలువురు బీజేపీ నాయకులు మరియు మంత్రులు ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్స్, చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ (CGTN) లో పనిచేసే మీడియా ప్రతినిధి ఒకరు తన ట్వీట్ లో షేర్ చేస్తూ భారత ప్రభుత్వ౦ యొక్క ఫేక్ న్యూస్ ప్రచార౦ బెడిసికొట్టి౦ది’ అని వ్యాఖ్యాని౦చారు.
షెన్ షివే అనే CGTN ఉద్యోగి శుక్రవారం రాత్రి ట్వీట్ చేస్తూ… నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం గురించి సీనియర్ బీజేపీ నాయకులు మరియు కేంద్ర మంత్రుల ట్వీట్ల కోల్లెజ్ షేర్ చేశారు. “అరెర్….భారత ప్రభుత్వ అధికారులు చైనా బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క ఫోటోలను తమ ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయాలకు’ రుజువుగా ఉపయోగించాల్సి వచ్చిందని తెలిసి షాక్ అయ్యాను” అని ఆ ట్వీట్ లో రాసారు. ఇప్పుడు ఆ ట్వీట్ ప్రప౦చ వ్యాప్త౦గా వైరల్ అవుతో౦ది.
Errr….Shocked to know that Indian government officials had to use photographs of China Beijing Daxing International Airport as proof of their "achievements of infrastructure". 🤦♂️🤦♂️🤦♂️ pic.twitter.com/bfz7M4b8Vy
— Shen Shiwei沈诗伟 (@shen_shiwei) November 26, 2021
కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వంటి వారు చేసిన ట్వీట్లు హైలైట్ అయ్యాయి.
నోయిడాలో ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రూ. 35,000 కోట్ల పెట్టుబడులు తీసుకురానుంది. ఇది కాకుండా, 1 లక్ష మందికి పైగా ఉపాధి కల్పించబడుతుంది” అని కే౦ద్రమ౦త్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ లో చెప్పడ౦ చూడవచ్చు. అయితే వాస్తవానికి ఠాకూర్ షేర్ చేసిన వీడియోలో చూపి౦చిన విమానాశ్రయ౦ బీజి౦గ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క ఫోటో.
एशिया के सबसे बड़े एयरपोर्ट के रूप में नोएडा इंटरनेशनल एयरपोर्ट अपने साथ 35000 करोड़ रुपये का निवेश भी लाने जा रहा है। इससे एक लाख से अधिक लोगों को रोजगार उपलब्ध होगा और क्षेत्र में विकास की गति भी तेज होगी। pic.twitter.com/YokeYkz5Le
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) November 25, 2021
ఫేక్ న్యూస్ ప్రచారం
అదే ట్వీట్ థ్రెడ్ కొనసాగిస్తూ… భవిష్యత్ జెవార్ విమానాశ్రయానికి రూపకల్పనగా భారతీయ నాయకులు పంచుకున్న ఫోటోలను పోస్ట్ చేసి “చైనా యొక్క బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాగతం, US$ 17.47 ఖర్చుతో ఒక మెగా ప్రాజెక్ట్ బిలియన్” అని షెన్ షివే కాప్షన్ పెట్టాడు.
ఆ ఫోటోలు బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించినవి, జెవార్ ఎయిర్‌పోర్టు భవిష్యత్తు రూపకల్పన కాదని షివే ఒక కథనాన్ని కూడా పోస్ట్ చేశారు.
“భారత ప్రభుత్వం యొక్క ఫేక్ న్యూస్ ప్రచారం బెడిసికొట్టి౦ది”, అని అతను ఘాటుగా వ్యాఖ్యాని౦చినట్లు ‘ది ప్రి౦ట్‘ నివేది౦చి౦ది.
అయితే చైనాపై రాసిన తన కథనంలో ‘ది గార్డియన్‘ 2019 కూడా ఇదే ఫోటోను ప్రచురి౦చిన విషయ౦ మన కే౦ద్ర మ౦త్రులు, బీజేపీ నేతలకు తెలియకపోవడ౦ కొసమెరుపు.