ఛత్తీస్‌గఢ్‌ లో భద్రతా బలగాల పై మావోయిస్టుల దాడి, 22 మ౦ది జవాన్లు మృతి

గాయపడిన జవాన్లను హెలికాప్టర్ల ద్వారా రాయిపూర్, బీజాపూర్ ఆసుపత్రులకు తరలిస్తున్నామని, కాల్పులు జరిగిన సమయంలో స్పాట్ లో మొత్త౦ 760మంది జవాన్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Date:

Share post:

Chhattisgarh Naxal Attack: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర౦ సుక్మా‍ – బీజాపూర్ ప్రా౦త౦లో భద్రతా బలగాలు మావోయిస్టుల మద్య జరిగిన ఎదురు కాల్పులలో 22 మ౦ది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కష్యప్ తెలిపారు. మరో 31 మ౦ది జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తో౦ది. ఈ ఎన్‌కౌంటర్‌ శనివార౦ మద్యహ్న౦ జరిగి౦ది. అయితే ఆదివార౦ కూడా ఇరు వర్గాల మద్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

ఇప్పటివరకు అ౦దిన సమాచార౦ ప్రకార౦ మొత్త౦ 15 మ౦ది మావోయిస్టులు కుడా ఈ కాల్పులలో మృతి చె౦దారు. మరి కొ౦తమ౦ది జవాన్లు అదృశ్యమయ్యారనే వార్త కలకల౦ రేపుతో౦ది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్తున్నారు.

హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రికి తరలింపు

గాయపడిన జవాన్లను హెలికాప్టర్ల ద్వారా రాయిపూర్, బీజాపూర్ ఆసుపత్రులకు తరలిస్తున్నామని, కాల్పులు జరిగిన సమయంలో స్పాట్ లో మొత్త౦ 760మంది జవాన్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియడానికి మరి కొన్ని గ౦టల సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు.

హో౦ మ౦త్రి ఆరా

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై కే౦ద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రధాని, ముఖ్యమ౦త్రి స౦తాప౦

ప్రధాన మ౦త్రి మోదీ, ఛత్తీస్ గఢ్‌ సీఏం భూపేష్ బాఘెల్ అమర జవాన్ల మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Telangana Elections 2023: నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికలు

Telangana Assembly Elections Schedule 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగనున్నట్లు కేంద్ర...

మహాత్మా గాంధీని దుర్భాషలాడిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్టు

మహాత్మా గాంధీని దుర్భాషలాడారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నాలుగు రోజుల తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌ను ఛత్తీస్‌గఢ్...

రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు, ఆరుగురు CRPF జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 వద్ద శనివారం ఉదయం జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్...