ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర భద్రతను (Chandrababu Naidu Security Increased) పెంచింది. రాష్ట్రంలో ఎన్నికలు ఎన్నికల పోలింగ అనంతరం పలు చోట్ల హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తుంది. చంద్రబాబుకు భద్రతపై ఆందోళనల క్రమంలో…. కేంద్రం ఆయనకు భద్రతను పెంచింది.
మీడియా సమాచారం ప్రకారం… గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముఖ్య భద్రతాధికారులు చంద్రబాబు ఉంటున్న నివాసం, టీడీపీ ఆఫీస్ మరియు గన్నవరం విమానాశ్రయం మార్గాలను పరిశీలించారు. అనంతరం ఆయనకు అదనంగా 12X12 రెండు బ్యాచులుగా 24 మంది SPG బ్లాక్ కాట్ కమాండోలను కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మరోపక్క యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు రక్షణ తగ్గించడం గమనార్హ.
చంద్రబాబుకు భద్రత పెంపు (Chandrababu Security Increased):
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భధ్రత పెంచిన కేంద్రం
గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబునాయుడి నివాసము, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గము తదితరాలను పరిశీలించారు. ఆమేరకు అదనముగా 12×12 రెండు… pic.twitter.com/Cxk7qBdFK1
— Swathi Reddy (@Swathireddytdp) May 16, 2024
ALSO READ: జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి