Chandrababu arrest: శనివారం ఉదయం, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో సీఐడీ అరెస్టు చేసింది. అరెస్టు అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు.
నిన్న అర్థరాత్రి, సీఐడీ అధికారులు నంద్యాలలో ఫంక్షన్ హాల్‌కు చేరుకుని శ్రీ నాయుడుకి అరెస్ట్ వారెంట్ అందించారు. అయితే టీడీపీ అధినేత మద్దతుదారులు నిరసనకు దిగడంతో ఆయనను అదుపులోకి తీసుకోలేకపోయారు.
అర్ధరాత్రి హై డ్రామా తర్వాత ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు చంద్రబాబుని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులకు, చంద్రబాబు మద్దతుదారులకు మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది అని మీడియా సమాచారం. పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, “నా పేరు ఎక్కడ ఉందో చూపించండి. ప్రాథమిక ఆధారాలు లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు?” అని చంద్రబాబు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 317 కోట్ల రూపాయల కుంభకోణానికి గాను టీడీపీ అధినేత అరెస్ట్ అయ్యారు అని తెలుస్తోంది. యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు టీడీపీ హయాంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం అతని వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ఇప్పుడు ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. “గత 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను. తెలుగువారి ప్రయోజనాలను కాపాడేందుకు నా ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధమయ్యాను”. “తెలుగు ప్రజలకు, నా ఆంధ్రప్రదేశ్‌కు మరియు నా మాతృభూమికి సేవ చేయకుండా నన్ను ఏ శక్తీ ఆపలేదు” అని ఈ పోస్ట్ లో పేర్కొనబడింది.
Chandrababu Naidu Arrest:
For the past 45 years, I have selflessly served Telugu people. I am prepared to sacrifice my life to safeguard the interests of Telugu people. No force on earth can stop me from serving Telugu people, my #AndhraPradesh and my motherland.
Posted at 6 AM, 09th September 2023 pic.twitter.com/721COYldUd
— N Chandrababu Naidu (@ncbn) September 9, 2023
ALSO READ: విదేశీ ఖాతాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా లెక్కలు లేవు: కే౦ద్ర౦