Byjus New CEO: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ భాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సీఈఓగా ఉన్న మృణాల్ మోహిత్ తన బాధ్యతలకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
వ్యక్తిగత కారణాలతోనే మృణాల్ తన పదవి నించి తప్పుకుంటున్నట్లు కంపెనీ వ్యవస్థాపకులు రవీంద్రన్ తెలిపారు. దీంతో కంపెనీలో ఇప్పటికే అనుభవం ఉన్న అర్జున్ మోహన్ సీఈఓ భాధ్యతలను తీసుకున్నారు. అర్జున్ సారధ్యంలో కంపెనీ మళ్ళీ గత వైభవం సాధిస్తుంది అని రవీంద్రన్ ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా కంపెనీ వృద్ధిలో మృణాల్ ఎంతో కీలక పాత్ర పోషించారని… అనంతరం వ్యక్తిగత బాధ్యతల కోసం సీఈఓ పదవిని వీడినట్లు రవీంద్రన్ పేర్కొన్నారు. సుమారు పది సంవత్సరాలు పాటు బైజూస్ కి సేవలందించి… సంస్థని వీడారు.
ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ… బైజూస్ వ్యవస్థాపక బృందంలో ఒక భాగం కావడం ఎంతో అద్భుతమైన ప్రయాణమని, ఈ సంస్థలో పనిచేసినందుకు తాను గర్వంగా భావిస్తున్నాను అని తెలిపారు.
ఎవరీ అర్జున్ మోహన్ ?
మృణాల్ మోహిత్ మరియు అర్జున్ మోహన్ ఇద్దరు రవీంద్రన్ శిష్యులే. మోహన్ గతంలో కంపెనీలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా పనిచేశారు. అయితే తరువాత రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులైలో మళ్ళీ తిరిగి బైజూస్ లోనే జాయిన్ అయ్యారు.
బైజూస్ కొత్త సీఈఓ (Byjus New CEO):
Edtech major #Byju’s elevated #ArjunMohan as the CEO of its India operations, as it mulls to sell some of its subsidiaries to repay its outstanding $1.2 billion Term Loan B (TLB) amid 'difficult business restructuring'.
Mohan succeeds Mrinal Mohit, founding partner and the… pic.twitter.com/MAgkYFosUq
— IANS (@ians_india) September 20, 2023