తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనకు దిగారు (BRS MLA Protest in Assembly). బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీ నుండి వాకౌట్ (Walkout) చేయడం జరిగింది
సభ నుంచి వాకౌట్ చేసి బయటకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని పోలీసులు చెప్పారు. ఈ నిబంధన ఎప్పుడుపెట్టారని చీఫ్ మార్షల్ ను ప్రశ్నించారు.
దీంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనకు దిగారు. మీడియా పాయింట్ వద్ద బ్యారికేడ్లు పెట్టడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించి… ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన (BRS MLA Protest in Assembly):
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్
అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని ఎప్పుడు నిబంధన పెట్టారని చీఫ్ మార్షల్ ను ప్రశ్నించిన… pic.twitter.com/cwVBZb91st
— BRS Party (@BRSparty) February 14, 2024