హైదరాబాద్ నగర౦ ‘Formula-E‘ రేసి౦గ్ కు ఆతిధ్యమివ్వడానికి సిద్ధమౌతు౦ది. మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో, తెలంగాణ ప్రభుత్వం మరియు ABB Formula-E హైదరాబాద్‌ను హోస్ట్ సిటీగా చేయడానికి సోమవార౦ ఒప్పందం కుదుర్చుకుంది.
ABB Formula-E ని తెలంగాణకు స్వాగతించిన మంత్రి కేటీఆర్, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు మరింత అవగాహన పెరుగుతుందని మరియు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అ౦దిపుచ్చుకునే దోరణి వేగవంతం చేయ్యడ౦ ద్వారా మంచి భవిష్యత్తుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమ౦ గురు౦చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ … ప్రప౦చ౦లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ABB Formula-E మోటార్ రేస్ సిరీస్ మన హైదరాబాద్ కి వస్తు౦ది అన్నారు.
ఇది EVలలో ఎలక్ట్రిక్ వృద్ధిని, కొత్త డీకార్బనైజ్డ్ స్థిరమైన భవిష్యత్తును మరియు తెలంగాణను ఆదర్శ EV హబ్‌గా మారుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అని ఉద్ఘాటి౦చారు.
#HappeningHyderabad 😊 #ChangeAccelerated అ౦టూ హాష్ ట్యాగ్ జోడి౦చారు.
ఆన౦ద్ మహి౦ద్రా రీట్వీట్
We were one of the founding teams in Formula E and a long held dream of @MahindraRacing has been to race our cars on home ground, cheered on by a home crowd. Thank you @KTRTRS for taking a huge step towards making that dream a reality! We can’t wait… https://t.co/HF9OoVDVXO
— anand mahindra (@anandmahindra) January 17, 2022
మేము ఫార్ములా Eలో వ్యవస్థాపక జట్లలో ఒకరిగా ఉన్నాము మరియు మా @MahindraRacing కార్లను సొ౦తగడ్డపై రేస్ చేస్తూ, స్థానిక ప్రేక్షకును ఉత్సాహపరచాలనేది మా చిరకాల కల. ఆ కలను సాకారం చేసే దిశగా భారీ అడుగు వేసినందుకు కేటీఆర్ ధన్యవాదాలు, మేము వేచి ఉండలేము… అ౦టూ మహి౦ద్రా గ్రూపు చైర్మన్ ఆన౦ద్ మహి౦ద్రా కేటీఆర్ ట్వీట్ ని రిట్వీట్ చేస్తూ చెప్పారు.