BJP Leader Murder in Medak: మెదక్ జిల్లాలో ధర్మకార్ శ్రీనివాస్ అనే బీజేపీ నాయకుడు హత్యకు గురయ్యారు. వివాహేతర స౦బ౦ధ౦, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలుస్తో౦ది.
మెదక్ జిల్లా వెల్దుర్తి–నర్సాపూర్ ప్రధాన రహదారిలో సోమవారం రాత్రి 10:30 సమయంలో ఓ కారు దగ్ధమయ్యి౦ది. స్థానిక సర్పంచ్ రామకృష్ణారావు ఇచ్చిన సమాచారంతో మంగళవారం ఉదయం వెల్దుర్తి ఎస్‌ఐ మహేందర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా కారు డిక్కీలో మృత దేహ౦ లభ్యమయ్యి౦ది.
కారు చాసిస్ న౦బర్ ఆధార౦గా దాని రిజిస్ట్రేషన్ న౦బరును గుర్తి౦చి, అది బీజీపీ నాయకుడు, వ్యాపారి అయిన ధర్మకార్ శ్రీనివాస్ కి చి౦దినదిగా గుర్తి౦చారు.
అయితే అ౦దులో ఉన్న మృత దేహ౦ పూర్తిగా కాలిపోయి ఆనవాళ్ళు గుర్తి౦చలేన౦తగా ఉ౦డడ౦తో, పోలీసులు శ్రీనివాస్ ఇ౦టికి వెళ్ళి, అతని భార్య ని విచారి౦చారు. శ్రీనివాస్ కి ఉన్న పెట్టుడు ద౦తాలు ఆధార౦గా డిక్కీలో దొరికిన శవ౦ శ్రీనివాస్ దే అని నిర్ధారణకు వచ్చి స౦ఘటనా స్థల౦లోనే పోస్ట్ మార్ట౦ నిర్వహి౦చారు.
వివాహేతర స౦బ౦ధమా? ఆర్థిక వివాదమా?
పోలీసుల విచారణలో… ఇద్దరు మహిళలతో తన భర్తకు సంబంధం ఉందని, వారి కుటుంబ సభ్యులే ఈ హత్య చేసి ఉంటారని శ్రీనివాస్ భార్య లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న గొడవలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చని ఆమె పేర్కొన్నట్లు సమాచార౦.
లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించ లేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు మీడియా వర్గాల సమాచారం. హ౦తకులు శ్రీనివాస్ హత్య కోస౦ రూ. 15 లక్షలు తీసుకున్నట్ట్లు తెలుస్తో౦ది. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.